తెలివిని మంచి పనికి వాడుంటే బాగుండేది !

Telugu Lo Computer
0


కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి చిన్న చిన్న పాన్‌ మసాలా ప్యాకెట్లలో అమెరికన్‌ డాలర్లను ఉంచి స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. కోల్‌కతా ఎయిర్‌పోర్టునుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఎయిర్‌ పోర్టు కస్టమ్స్‌ అధికారులకు అతడిపై అనుమానం వచ్చింది. అతడ్ని పిలిచి, సోదా చేయసాగారు. ఈ నేపథ్యంలోనే బ్యాగ్‌లోని మసాలా ప్యాకెట్లు కొంచెం తేడాగా ఉన్నట్లు గుర్తించారు. ఓ దాన్ని తీసి చూడగా.. డాలర్‌ నోట్లు బయటపడ్డాయి. దీంతో మిగిలిన వాటన్నింటిని కత్తిరించి బయటకు తీశారు. ఇలా మొత్తం 40 వేల డాలర్లను మసాలా ప్యాకెట్ల నుంచి తీశారు. వీటి విలువ భారత కరెన్సీలో అక్షరాలా 32 లక్షల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఆయన తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ ట్వీట్‌ చేశారు. '' దేశంలో వినూత్నమైన ఆలోచనలకు, తయారీకి కొరతలేదు. ఈ వ్యక్తి తన తెలివిని మంచి పనికి, సక్రమైన పనికి వాడి ఉంటే బాగుండేదని భావిస్తున్నాను'' అని పేర్కొన్నారు. మసాలా ప్యాకెట్ల వీడియోను కూడా పోస్ట్‌లో ఉంచారు. ఆయన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో ఉంచటంతో ఇంకా వైరల్‌గా మారింది. ఏకంగా ఆనంద్‌ మహీంద్రాను ఆశ్చర్య పర్చిన ఆ వీడియోను నెటిజన్లు ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే ఆ వీడియో లక్షకు పైగా వ్యూస్‌తో పాటు వేల సంఖ్యలో లైక్స్‌ సంపాదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)