ట్రాఫిక్ కానిస్టేబుల్‌ పై దాడి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 11 January 2023

ట్రాఫిక్ కానిస్టేబుల్‌ పై దాడి !


హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్‌లో ఓ కారు డ్రైవర్‌ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఎల్‌.నగేష్‌ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినా సరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్‌ ఆ కారు దగ్గరికి వెళ్ళగా డ్రైవర్‌ కోపంతో కానిస్టేబుల్‌ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

No comments:

Post a Comment