గురువాయూర్ గుడి ఆస్తుల వివరాలు వెల్లడి !

Telugu Lo Computer
0


కేరళలోని గురువాయూర్ గుడి ఆస్తుల వివరాలు  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు వెల్లడించారు. ఈ గుడి పేరు మీద బ్యాంకులో డిసెంబరు నాటికి 1,737.04 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 19,981 వేల బంగారు లాకెట్లు, బంగారు నాణెలు సహా ఇతర వస్తువుల రూపంలో మొత్తం 263.637 కిలోల బంగారం ఉందట. వీటితో పాటు ఈ గుడి పేరు మీద 271.05 ఎకరాల భూమి ఉన్నట్లు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే బంగారం, భూమి విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇవే కాకుండా 6,605 వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇది 5,359 వివిధ లాకెట్లు, నాణేలు ఇతర వస్తువుల రూపంలో ఉందట. దీని విలువ కూడా ఎంతో వెల్లడించలేదు. గురువాయూర్ ప్రాంతానికి చెందిన ప్రాపర్ ఛానల్ అనే సంస్థ అధినేత ఎంకే హరిదావ్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటికి వెల్లడైంది. ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం విషయంలో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ కారణంగానే ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు కోరాల్సి వచ్చిందని హరిదాస్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)