ఎల్లలెరుగని ప్రేమ వివాహం !

Telugu Lo Computer
0


ఫేస్‌బుక్‌లో పరిచయమైన పవన్ కుమార్‌ను వివాహం చేసుకోవడానికి స్వీడన్ కు చెందిన క్రిస్టెన్ లైబర్ట్ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ఎటాకు చేరుకుంది. తల్లిదండ్రుల అంగీకారంతో వీరి పెళ్లి ఓ పాఠశాలలో హిందూ ఆచారాల ప్రకారం ఘనంగా జరిగింది. వైరల్ అవుతున్న వీరికి సంబంధించిన వీడియోలో క్రిస్టెన్ లైబర్ట్ భారతీయ వివాహ దుస్తులను ధరించి ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరూ గత పదేళ్ల క్రితమే అంటే 2012లో ఫేసుబుక్ లో పరిచయమయ్యారని సమాచారం. వీరి పెళ్లికి కూడా అతని కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని పవన్ తండ్రి గీతం సింగ్ అన్నారు. ఈ పెళ్లికి తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని చెప్పడం గొప్ప విషయం. అయితే డెహ్రాడూన్‌లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఓ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)