భర్త నాలుకను కొరికిన భార్య !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో సల్మా అనే మహిళ పిల్లలతో తన తల్లి ఇంట్లో కొంతకాలంగా ఉంటుంది. భర్త పుట్టింట్లో ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి అత్తగారింటికి వెళ్ళాడు. ఆమె భర్తతో తిరిగి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో భార్యాభర్తలు ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. భర్త కోపంతో భార్యపై ఉమ్మి వేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, భార్య తన భర్తను పట్టుకొని అతని నాలుకను గట్టిగా కొరికింది. దీంతో నాలుక తెగి నేలపై పడింది. ఊహించని పరిణామానికి భర్తతో పాటు సల్మా తల్లి కుటుంబం కూడా షాక్ కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మున్నా కూడా నేలపై పడిపోయాడు. దీంతో పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మున్నా మాట్లాడలేకపోతున్నాడు. సల్మాను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)