ఒకే రోజు సప్త వాహనాలపై తిరుమలేశుడి దర్శనం !

Telugu Lo Computer
0


ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఏడు వాహనాల్లో తిరుమలేశుడు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ నెల 28న రధసప్తమి కోసం తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావిస్తారు. రధ సప్తమి అయిన సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ సమాయత్తం అవుతోంది. మినీ బ్రహ్మోత్సవాలుగా ఆ రోజు నిర్వహించే సేవలను పరిగణిస్తారు. ఈ నెల 28న తిరుమలలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను ఖరారు చేసారు. ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) - సూర్యప్రభ వాహనం పైన స్వామి వారి ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం పైన మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహణకు నిర్ణయించారు. ఈ రెండు వాహనాల సేవలు తరువాత ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)