లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుకు నిరసనగా ఆప్‌ పార్టీ ర్యాలీ

Telugu Lo Computer
1


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆప్‌ సోమవారం ప్రదర్శన చేపట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆప్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎల్‌జి వి.కె. సక్సేనా కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ''లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గారూ, ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్‌ వెళ్లేందుకు అనుమతించండి'' అని రాసి వున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఢిల్లీ పాఠశాల ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్‌లాండ్‌కు పంపే ప్రతిపాదనను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్‌  కార్యాలయం తిరస్కరించడంపై ఆప్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఢిల్లీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఢిల్లీ ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన నగదుని, విద్య కోసం ఖర్చు చేస్తున్నామని, దీనివలన ఎల్‌జికి వచ్చిన సమస్య ఏమిటని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఢిల్లీ సిఎం, ఎమ్మెల్యేలు ఎల్‌జి కార్యాలయానికి ర్యాలీ చేపట్టాల్సిరావడం దురదృష్టకరమని అన్నారు. ఎల్‌జి తన తప్పు తెలుసుకుని, ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు అనుమతిస్తారని ఆశిస్తున్నానని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. 2018నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు.

Post a Comment

1Comments

  1. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుకు నిరసనగా ఆప్‌ పార్టీ ర్యాలీ తీయటం సరైనవిధానం కాదేమో యోచించవలసి ఉంటుంది. గవర్నర్ వ్యవస్థలో ఆగవర్నరుకు సహాయంగానే ముఖ్యమంత్రీ మంత్రిమండలీ యేర్పడుతుంది రాజ్యాంగం ప్రకారం. నియామకులకు వ్యతిరేకంగా ర్యాలీ తీయటం సరికాకపోవచ్చును. నుయామకులకు విన్నపం చేయటమే ఉచితం. విన్నపాలకు గతిలేని పరిస్థితిలో మంత్రిమండలితో‌ సహా ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయవచ్చును నిరసనగా. అంతే కాని గవర్నరుకు బహిరంగంగా నిరసన ప్రదర్శన చేయకూడదని అనుకుంటాను. అది ఉచితమే అనే వారు ఈప్రశ్నకు బదులు చెప్పండి - ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా ఏమంత్రి ఐనా సరే ఇలా వీధికెక్కి ర్యాలీ చేయటం కూడా సరైనదే అవుతుందా కాదా?

    ReplyDelete
Post a Comment