గీతలు, రాతలు ఉన్న కరెన్సీ చెల్లుతుందా ?

Telugu Lo Computer
0


రాతలు, గీతలు ఉన్న నోట్లు చెల్లవు' అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం వైరల్‌గా మారింది. చాలా మంది గీతలు, రాతలు ఉన్న 100, 200, 500, 2000 వేల రూపాయల నోట్లు చెల్లవని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా షాపు వాళ్లు గీతలు, రాతలు ఉన్న పెద్ద నోట్లను తీసుకోవటం లేదు. ఇక, సామాన్య జనం కూడా తమకు గీతలు, రాతలు ఉన్న నోట్లు వస్తే భయపడిపోతున్నారు. వాటిని తిరిగి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ ఫొటోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గీతలు, రాతలు ఉన్న 100, 200, 500, 2000 వేల రూపాయల నోట్లు చెల్లవు అని జరుగుతున్న ప్రచారంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో ఓ ఫాక్ట్‌ చెక్‌ను విడుదల చేసింది. ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. '' బ్యాంకు నోట్లపై ఏదైనా రాస్తే అవి చెల్లకుండా పోతాయా? కాదు, రాతలు ఉన్న బ్యాంకు నోట్లు కచ్చితంగా చెల్లుతాయి. క్లీన్‌ నోట్‌ పాలసీ ప్రకారం ప్రజలు దయచేసి కరెన్సీ నోట్లపై రాయకండి. అలా చేస్తే అవి పాడవుతాయి, వాటి జీవితకాలం కూడా తగ్గిపోతుంది'' అని స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ప్రకారం ఆర్‌బీఐ తెచ్చిన క్లీన్‌ నోట్‌ పాలసీ ప్రజలకు మంచి నాణ్యత కలిగిన కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ ఇస్తుంది. పాడయిన వాటిని సర్యులేషన్‌లోంచి వెనక్కు తీసుకుంటుంది. ఆర్‌బీఐ ఈ పాలసీని 1999లో అమల్లోకి తెచ్చింది. ప్రజలు నోట్లపై రాయకూడదని మాత్రమే ఈ పాలసీ చెబుతోంది. పాడైన నోట్లను తీసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు ఉన్నాయి. అంతే తప్ప రాతలు, గీతలు ఉన్న బ్యాంకు నోట్లు చెల్లవని ఎక్కడా కూడా లేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)