రేపు హాజరు కాలేను !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ దూకుడు పెంచింది. చాలా రోజుల తర్వాత సీబీఐ అధికారులు నిన్న పులివెందుల చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, ఇంటి వద్ద వైఎస్ భాస్కరరెడ్డి కోసం సీబీఐ అధికారులు వాకబు చేశారు. ఇదే క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డి హజరు కావాల్సి ఉంది. అయితే ఈ అంశంపై అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. సీబీఐ విచారణకు పూర్తి గా సహకరిస్తానని పేర్కొన్న అవినాష్ రెడ్డి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల మంగళవారం విచారణకు హజరు కాలేనని చెప్పారు. అయిదు రోజుల వరకూ విచారణకు హజరుకాలేనని పేర్కొన్నారు. అయిదు రోజుల తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు అవుతానని తెలిపారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు సమ్మతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతి మేరకు విచారణ తేదీలను మార్పు చేసిన అధికారులు.. అవినాష్ రెడ్డి విషయంలోనూ సమయం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి  కావడంతో సీబీఐ అధికారులు ఆయన విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తారని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)