యువతిపై అత్యాచారం

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని థానె జిల్లా డోంబివిలి నగరంలో ఓ యువతి, యువకుడు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ జంట ఇటీవల సరదాగా బయటకు వెళ్లారు. ఓ చోట కూర్చుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో అటు నుంచి ఇద్దరు యువకులతో ప్రయాణిస్తున్న ఓ కారు వచ్చి ఆ ప్రేమ జంట ముందు ఆగింది. వారు వెంటనే కారులో నుంచి బయటకు దిగి, మేము పోలీసులం, మీరు ఇక్కడేం చేస్తున్నారని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఫేక్ పోలీసులు ఇద్దరినీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు ప్రియుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డారు.  ఇంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని తమ సెల్ ఫోన్ లో వీడియోలు కూడా తీసుకున్నారు. అనంతరం ఆ దుండగులు వారిని వదిలేసి అక్కడి నుంచి కారులో పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రేమజంట జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)