డెంటల్‌ సర్జరీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 11 January 2023

డెంటల్‌ సర్జరీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి !


తీవ్రమైన పంటి సమస్యతో బాధపడుతున్న ఓ బాలుడి కోసం త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ సాహా తన వృత్తి ధర్మం నెరవేర్చారు. తాను సీఎం కాకముందు పనిచేసిన హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లి బాధిత బాలుడికి విజయవంతంగా డెంటల్‌ సర్జరీ నిర్వహించారు. ఓరల్‌ సిస్టిక్‌ లీషన్‌ అనే పంటి సమస్యతో బాధపడుతున్న బాలుడికి సర్జరీ నిర్వహించడానికి మానిక్‌ సాహా ఇవాళ ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే ఆపరేషన్‌ థియేటర్‌లో సిద్ధంగా ఉన్న పేషెంట్‌కు అరగంట పాటు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత సర్జరీని సక్సెస్‌ఫుల్‌ చేసి చిరునవ్వుతో బయటికి వచ్చారు. ఈ సర్జరీ సందర్భంగా మానిక్‌ సాహాకు డాక్టర్‌ అమిత్‌లాల్‌ గోస్వామి, డాక్టర్‌ పూజా దేవ్‌నాథ్‌, డాక్టర్‌ రుద్రప్రసాద్‌ చక్రవర్తి తదితరులు సహాయకులుగా ఉన్నారు. ఆపరేషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన త్రిపుర సీఎం.. తాను చాలా రోజుల తర్వాత సర్జరీ చేశానని, అయినా పెద్దగా ఇబ్బందేమీ అనిపించలేదని చెప్పారు.

No comments:

Post a Comment