ముర్ము పాదాలు తాకేందుకు యత్నించిన మహిళా ఇంజినీర్‌ సస్పెండ్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 14 January 2023

ముర్ము పాదాలు తాకేందుకు యత్నించిన మహిళా ఇంజినీర్‌ సస్పెండ్‌ !


రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జనవరి 3, 4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్‌ సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతికి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచి చూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే, ప్రొటోకాల్‌ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిణి  రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. అయితే, రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన రాజస్థాన్‌ ప్రభుత్వం, రాజస్థాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ నియమాల ప్రకారం, సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

No comments:

Post a Comment