రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని అన్నయ్య జిల్లా మదనపల్లిలో అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం లభ్యమైంది. దీనిని పరిశీలించి రేనాటి చోళులు వేసిన ఏడో శతాబ్ధం నాటిదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. 50 ఏళ్ల తరువాత రాయలసీమలో మళ్లీ  తెలుగు శాసనం బయటపడింది. మదనపల్లి శివారులోని కొత్తరెడ్డి గారిపల్లిలో తమిళనాడులోని సేలం కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దన్ బాల్ అన్వేషణలో చోళుల కాలం నాటి ఈ శిలా శాసనం బయటపడింది. చోళుల కాలం నాటి వీరగల్లును ఆన్వేషిస్తుండగా ఈ శాసనం వెలుగులోకి వచ్చింది. పంట పొలాల్లో ఉన్న ఈ శాసనాన్ని గుర్తించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మైసూర్ పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వచ్చి ఈ శాసనాన్ని పరిశీలించారు. ప్రాచీన తెలుగు భాషగా అధికారులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)