తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు పోటీ !

Telugu Lo Computer
0


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. రాష్ట్ర సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు ఎప్పుడూ దోస్తీనే ఉంటుందని చెప్పారు. రాజకీయ కారణాలతోనే ఆంధ్రప్రదేశ్ లో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరు అని, రెండిటినీ పోల్చి చూడాలేమని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు కొండగట్టు చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)