బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఆగ్రహం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 24 January 2023

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఆగ్రహం !


నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేనన్నారు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం'అని నాగచైతన్య, అఖిల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. 'అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం' అని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి. 

No comments:

Post a Comment