ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సిందే !

Telugu Lo Computer
0


సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా సోమేష్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం కేటాయిచింది. అయితే తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్‌కుమార్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాలతో సోమేష్‌ కుమార్‌ తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎస్‌తో పాటు మరో 15 మంది ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు కూడా క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్‌ నిర్ణయాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో చీఫ్‌జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలో విచారణ జరిపారు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు ఆలిండియా సర్వీస్‌ అధికారుల విభజన చేపట్టినందున సోమేష్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ వెళ్లాల్సిందేనని ఆయన అవసరం అనుకుంటే ఏపీ నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలని సూచించారు. గతంలో క్యాట్‌లో జరిగిన విచారణలో సిబ్బంది కేటాయింపు అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన విషయం గుర్తు చేశారు. సోమేశ్‌కుమార్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మనసు మార్చుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014, జూన్ 2 కు ముందు రోజు పీకే.మహంతి రిటైర్‌ అయ్యారని, ఆయన పేరును విభజన జాబితాలో చేర్చి ఉంటే తాను తెలంగాణ క్యాడర్‌లో ఉండేవాడినని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వాదించారు. అయితే ఆయన వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. సర్వీసు పూర్తయిన వ్యక్తిని కేటాయింపు జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. పీకే.మహంతి కుమార్తె, అల్లుడు కోసం తనపై వివక్ష చూపారన్న వాదన్నలి కేంద్రం తిరస్కరించింది. అధికారుల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో పీకే.మహంతి ఎక్స్‌ అఫిషియో సభ్యుడు మాత్రమేనని, మిగతా సభ్యులుండగా వివక్షకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే వరకు మహంతి పాత్ర పరిమితమని డీవోపీటీ స్పష్టం చేసింది. అధికారుల కేటాయింపులో ఎవరు ఏ రాష్ట్రానికి వెళ్తారనే విషయం సభ్యులకు తెలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు వెళ్లేందుకు తనకు స్వాపింగ్‌ అవకాశం ఇవ్వలేదన్న వాదనలు డీవోపీటీ తిరస్కరించింది. సోమేష్‌కుమార్‌ వ్యవహారంలో బ్యాచ్‌ స్వాపింగ్‌ అనుమతించామని గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సోమేశ్‌ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిందే అని తీర్పు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)