కారులో వ్యక్తి సజీవ దహనం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 January 2023

కారులో వ్యక్తి సజీవ దహనం


తెలంగాణలోని మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ భీమ్లా తాండకు చెందిన ధర్మ అనే వ్యక్తి హుందాయి కారులో దగ్ధమై శవంగా కనిపించినా సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, కారణాలు ఏమిటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  హైదరాబాదులోని సచివాలయంలో ధర్మ ఏఎస్ఓగా 2013 నుంచి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భార్య ఆరోగ్య పరిస్థితిలో బాగాలేనందున మూడు నాలుగు రోజులు తన స్వగ్రామమైన భీమ్లా తండాలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఐఐటీ జార్ఖండ్ లో చదువుతున్నారన్నారు, ఇతని మరణానికి కారణాలు రెండు కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని, ఒకటి కారు లోయలో పడి మంటలు చెలరేగాయా లేదా దగ్దమైన కారు పక్కన పెట్రోల్ డబ్బాలు కనబడడంతో మరోక కోణంలో విచారణ చేపట్టారు.  ఎవరన్నా కక్ష పూరితంగా తలగబెట్టి హతమార్చారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అల్లదుర్గ్ సీఐ జార్జ్ తెలిపారు.

No comments:

Post a Comment