అన్నింటా టాప్ నగరంగా వియన్నా !

Telugu Lo Computer
0


ఆస్ట్రియా రాజధాని నగరం అయిన వియన్నాలో హాయిగా, ఆనందంగా ఉండొచ్చని ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌  అంటోంది. ఇక్కడ ఉండాలంటే పెద్దగా ఖర్చు కూడా అవ్వదు అని చెబుతోంది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం-విజ్ఞానం-సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లాండ్ ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చిందని ఎకనామిస్ట్‌ పత్రిక ప్రచురించింది. కరోనా దెబ్బకు అక్లాండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థానంలో నిలిచింది. కరోనా వచ్చిన కొత్తలో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్‌ 19 స్థానంలో, లండన్‌ 33, మిలన్‌ 49, న్యూయార్క్‌ 51వ స్థానంలో నిలిచాయి. అయితే ఈ లెక్కలు అన్నీ 2022వ సంవత్సరానివి. కేలండర్ మారింది. రోజులు మారాయి, పరిస్థితులూ మారుతున్నాయి. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఆర్ధిక మాంద్యం తరుముకొస్తోంది. కాబట్టి ఈ ఏడాది అన్ని లెక్కలూ మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ ఉత్తమ నగరాల లిస్టూ మారిపోతుంది. అయితే అది తెలియడానికి కనీసం ఏడాదిలో ఆరు నెలలు అయినా టైమ్ పడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)