జాతి జనాభాను పెంచండి : ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌

Telugu Lo Computer
0


సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా ముఖ్యమంత్రి  ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్‌ ఇచ్చారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్‌, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్‌ ఇక్రిమెంట్‌తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు. ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్‌ వెల్లడించారు. ఐవీఎఫ్‌ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)