పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని సమాచారం అందుకున్న చిత్రకూట్ పోలీసులు సోమవారం రాత్రి ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే సత్నా జిల్లా మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాధనా పటేల్ సహా ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసులతో సాధనాకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలోనే ఒక పోలీసు అధికారిని చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకురాలు సాధనా పటేల్ సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై చిత్రకూట్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఆశిష్ జైన్ మాట్లాడుతూ 'పత్రా గ్రామంలో అక్రమ మైనింగ్ గురించి చిత్రకూట్ నాయబ్ తహసీల్దార్, సుమిత్ గుర్జార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు, తహసీల్దార్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్న కొంతమంది వ్యక్తులను గుర్తించారు. ఒక జేసీబీ యంత్రం, రెండు ట్రాక్టర్లు కూడా కనిపించాయి. పోలీసు బృందం వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు పోలీసు బృందాన్ని దుర్భాషలాడారు. కొన్ని నిమిషాల తర్వాత సాధనా పటేల్ వచ్చారు. అనంతరం పోలీసు సిబ్బందిపై సాధనా దుర్భషలాడారు. ఈ సందర్భంలోనే ఒక పోలీసు అధికారిని చెప్పుతో కొట్టారు" అని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి తహసీల్దార్ లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఫిర్యాదుపై చర్య తీసుకొని, ఎనిమిది మంది వ్యక్తులపై ఐపిసి సెక్షన్లు 147, 148, 149, 294, 186, 353, 332, 379, 506 కింద కేసు నమోదు చేశాం. సాధనా పటేల్‌తో సహా మిగతా వారిపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)