చైనాలో నెల రోజుల్లో 60వేల కోవిడ్ మరణాలు

Telugu Lo Computer
0


చైనాలో  నెల రోజుల్లోనే 60 వేల మంది కోవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. డిసెంబర్‌లో వైరస్ ఆంక్షలు ఎత్తివేశాక మరణాల గురించి తెలుపని చైనా ఇప్పుడు తొలి మరణాల సంఖ్యను వెల్లడించింది. చైనాలో 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 వరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 59938గా ఉంది. ఈ వివరాలను జాతీయ ఆరోగ్య కమిషన్ యొక్క మెడికల్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో హెడ్ జియోవ్ యహూయి విలేకరుల సమావేశంలో తెలిపారు. వైద్య సంస్థలు రికార్డు చేసిన మరణాల రికార్డుల మేరకే ఈ సంఖ్య. మొత్తంగా చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మరణాల్లో వైరస్ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమై మరణించిన వారి సంఖ్య 5503, ఇక కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 54435గా ఉంది. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని చైనాపై ఆరోపణలు ఉన్నాయి. మరణాల సంఖ్యను మరింత ర్యాపిడ్‌గా, రెగ్యులర్‌గా, ఆసుపత్రుల నమ్మదగిన డేటా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రేయేసస్ చైనాను కోరారు. చైనాలో 60 ఏళ్లకు పైబడిన లక్షలాది మందికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. చాలా మంది వ్యాధిని తట్టుకోలేకుండా చనిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)