ఝుకేగా నహీ సాలా : మనోజ్ తివారీ

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ లోని హౌరా మైదాన్ లో జరిగిన టీఎంసీ ర్యాలీలో  క్రీడా మంత్రి  మనోజ్ తివారీ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపై ఉండాలని, కలిసికట్టుగా ఉండాలని కోరుతూ బీజేపీకి సవాల్ విసిరాడు. 'ఝుకేగా నహీ సాలా' అంటూ ''పుష్ప సినిమాలోని డైలాగ్స్‌ని వినండని బీజేపీ వర్కర్స్‌కి ఛాలెంజ్ చేశాడు. ఇది రాజకీయంగా అగ్గిరాజేసింది. బీజేపీ వర్గాలకు కోపమొచ్చి, తిరిగి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. మనోజ్ తివారీ వ్యాఖ్యలకు వెస్ట్ బెంగాల్ బీజేపీ స్టేట్ సెక్రటరీ అయిన ఉమేష్ రాయ్ కౌంటర్ ఇస్తూ.. మొత్తం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పుష్ప సినిమాలాగా ఉందని, తివారీ స్టేట్మెంట్స్ ఆ పార్టీ క్యారెక్టర్‌ని నిర్దేశిస్తాయమని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్ చెప్పినట్టుగా తివారీ చెప్పాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమేశ్ రాయ్‌తో బీజేపీకి చెందిన ఇతర నేతల నుంచి కూడా తివారీ వ్యాఖ్యలపై కౌంటర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తివారీ క్షమాపణలు చెప్పాడు. ర్యాలీలో భాగంగానే ఓ మీడియా ప్రతినిధి తనపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా.. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అందుకు తాను సారీ చెప్తున్నానని అన్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)