దర్యాప్తులో అలసత్వం లేకుంటే, నా కుమార్తె బతికి ఉండేది !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర పోలీసులు సహాయం చేసి ఉంటే తన కుమార్తె బతికి ఉండేదని శ్రద్దావాకర్‌ తండ్రి వికాస్‌ వాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె మరణించిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఢిల్లీ పోలీసులు, వసారు పోలీసులు సంయుక్తంగా కలిసి జరిపిన విచారణ బాగుంది. అయితే వసారు పోలీసులు, నలసోపరా పోలీసులు దర్యాప్తులో అలసత్వం వహించారు. ఇది దురదృష్టకరం. మాకు న్యాయం చేస్తామని ఢిల్లీ పోలీసులు హామీ ఇచ్చారు. నా కుమార్తె అత్యంత దారుణంగా హత్య చేయబడింది. వసారు పోలీసుల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. వారు సరైన సమయంలో సహాయం చేసి ఉంటే నా కుమార్తె బతికి ఉండేది' అని ఆయన అన్నారు. తన కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలాకు ఉరిశిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే అఫ్తాబ్‌ కుటుంబ సభ్యులు, బంధువులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రద్ధావాకర్‌ హత్యకు ప్రధాన కారణం డేటింగ్‌ యాప్‌ అని, అలాంటి వాటిని పర్యవేక్షించాలని వికాస్‌ తరపు న్యాయవాది సీమా కుష్వాహా డిమాండ్‌ చేశారు. 'డేటింగ్‌ యాప్‌లను ఉపయోగించుకునే హక్కు ప్రజలకుంది. అయితే ఈ యాప్‌లను పర్యవేక్షించాలి. ఈ యాప్‌లలో నేరస్తులు, ఉగ్రవాదులు ఉండవచ్చు' అని ఆమె అన్నారు. శ్రద్ధావాకర్‌ హత్య కేసులో.. అఫ్తాబ్‌తోపాటు.. వారి కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో చేర్చాలని భావిస్తున్నట్లు ఆమె అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)