సికింద్రాబాద్‌ - విశాఖల మధ్య వందే భారత్ రైలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 1 December 2022

సికింద్రాబాద్‌ - విశాఖల మధ్య వందే భారత్ రైలు !


సికింద్రాబాద్‌ – విశాఖల మధ్య వందే భారత్‌ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. రైల్వే శాఖ ఈ సెమీ హై స్పీడ్‌ రైలును ఈ రెండు ప్రాంతాల మధ్య నడిపేందుకు యోచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వందే భారత్‌ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న ప్రతిపాదనను భారతీయ రైల్వే గ్రీన్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అయితే రెండు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా విశాఖపట్నం వరకు పొడిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రైలు వరంగల్, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య రైలు నడపడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వందే భారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే మూడేళ్లలో పలు నగరాలను కలుపుతూ 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. వందే భారత్ రైళ్లను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపొంచింది. 100 కోట్లకుపైగా ఖర్చుతో తయారయ్యే ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. నిజానికి టెస్టింగ్ సమయంలో ఈ ట్రైన్‌ 180 కి.మీ/గంట వేగంతో దూసుకెళ్లినప్పటికీ అంత స్పీడ్‌ను తట్టుకునేలా రైల్వే ట్రాక్స్‌ లేని కారణంగా గరిష్టంగా గంటకు 130 కి.మీల వేగంతో ప్రయనిస్తున్నాయి. ఒక్కో కోచ్‌ 23 మీట్ల పొడవు ఉంటుంది. ఈ రైళ్లలో జీపీఎస్‌ వ్యవస్థ, బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు, కదిలే సీట్లను రూపొందించారు. 140 సెకనల్లోనే గంటకు 160 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. అయితే అంతవేగంలోనూ ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణం సాగుతుంది. డోర్లు ఆటోమెటిక్‌గా తెరుచుకునే, మూసుకునే టెక్నాలజీని అందించారు. ఇక ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరగడం విశేషం. 

No comments:

Post a Comment