రోడ్డుపై డ్యాన్స్ చేసిన పర్యాటకులు !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ లో మంచు అందాల నుడమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు పర్యాటకులు మానాలికి క్యూ కట్టారు. విపరీతంగా కురుస్తున్న మంచును లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా బయల్దేరారు. ఎత్తైన ప్రాంతాలలో హిమపాతాన్ని చూసేందుకు అటల్ టన్నెల్,రోహ్ తంగ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. కానీ టూరిస్ట్ లు మనాలి నుంచి బయటకు రాకముందే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. వాహనాలు అయితే కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అయితే కొందరు పర్యాటకులు మాత్రం ట్రాఫిక్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒకవైపు మంచుపరుచుకున్న అందాలు, మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనాలనే ఉత్సాహం పర్యాటకుల్లో కనిపించింది. దీంతో టూరిస్ట్ లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయినా వారిలోస్ఫూర్తిని మాత్రం తగ్గించలేకపోయింది. కిటకిటలాడిన రోడ్ల మధ్యలో చాలా మంది డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తాము ఉదయం 7 గంటలకు అటల్ టన్నెల్ కి బయలు దేరాము. మేమంతా మనాలి నుంచి బయటకురావడానికి మూడు గంటల సమయం పట్టిందని హర్యానాకు చెందిన పర్యాటకుడు పర్విన్ చెప్పారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి. నవీ ముంబయి నుంచి మహారాష్ట్రలోని రాయగఢ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)