వివాహేతర సంబంధం కాపురంలో చిచ్చు పెట్టింది !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ రత్లామ్ జిల్లా తారాగఢ్ గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. అలా వీరి కాపురం సాగుతున్న తరుణంలో భార్య స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా కొన్నాళ్ల పాటు ఆ మహిళ భర్తకు తెలియకుండా జాగ్రత పడింది.  రాను రాను ఆ మహిళకు భర్తతో ఉండడం కంటే ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. దీంతో ఇటీవల ఆ మహిళ భర్తను కాదని ప్రియుడితో వెళ్లిపోయింది. ఇక పరువు పోయిందని అనుకున్న భర్త భార్యపై కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ప్రియుడితో వచ్చి ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. భార్యను బయటకు తీసుకొచ్చి ఓ చెట్టుకు కట్టేశాడు. అనంతరం ఆమెపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)