కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ దుష్యంత్ చౌతాలా

Telugu Lo Computer
0


హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం ఉదయం పోలీసు జీపు ఢీకొన్న ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దుష్యంత్ చౌతాలా కాన్వాయ్ హిసార్ నుంచి సిర్సా వెళుతుండగా అగ్రోహా సమీపంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్ర పోలీసుల బొలెరో కారు సడన్ బ్రేక్‌లు వేయడంతో హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్‌లోని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం బారి నుంచి డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సురక్షితంగా బయటపడ్డారు.ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)