శవ దహనానికి రూ.5 వేలు ఫీజు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ శవ దహనానికి ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. శ్మశానాల్లో శవ దహనానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేయాలని పాలక వర్గం నిర్ణయించింది. ఇందులో కట్టెలు, డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశ ఎజెండాలో రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పట్టణ స్థానిక సంస్థలు చట్టపరంగా సామాజిక బాధ్యతగా ప్రజలకు కొన్ని సేవలు ఉచితంగా అందించాలి. ఇంకొన్నింటిపై నామమాత్రపు రుసుంను విధించాలి. పుర, నగరపాలక సంస్థలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల నుంచి భారీగా పన్నులు, ఇతర రుసుములు వసూలు చేస్తూనే, కొన్ని సేవలపై ఖర్చుకి తగ్గ సమాన మొత్తాలను ప్రజల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)