నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?

Telugu Lo Computer
0


తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామానికి చెందిన షణ్ముగం అనే రైతు గుండె, కాలేయ సమస్యలతో బాధపడుబాధపడుతూ ఇటీవల ఆ రైతు అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబీకులు వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ.. ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం చికిత్సకు సహకరించలేదు. షణ్ముగం కూడా ఎలాంటి కదలికలు లేకుండా శవంలా ఉండిపోయాడు. దీంతో అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, అతని బాడీని అప్పగించారు. గురువారం షణ్ముగం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఇంటి బయట తిన్నెపై కూర్చోబెట్టారు. అంత్యక్రియల తంతుని ప్రారంభించారు. తమ సంప్రదాయం ప్రకారం షణ్ముగం కుమారుడు కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలు పోశాడు. అంతే షణ్ముగం ఒక్కసారిగా దగ్గుతూ, కళ్లు తెరిచాడు. ఆ దెబ్బకు చుట్టూ ఉన్న బంధువులు బెంబేలెత్తిపోయారు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొచ్చాడా ? అంటూ ఖంగుతిన్నారు. మరోవైపు.. 'ఏం జరిగింది ?' అంటూ షణ్ముగం లేచి నిల్చున్నాడు. అంతే అక్కడున్నవారంతా బెంబేలెత్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)