యూరప్ ని కుదిపేస్తున్న ఖతార్ స్కాండల్ !

Telugu Lo Computer
0


ఫిఫా వరల్డ్ కప్ వేదికను ఖతార్ కి ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు వస్తున్న వార్తలతో యూరోప్ లో పెను దుమారం రేగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఖండాన్ని ఈ భారీ అవినీతి కుంభకోణం కుదిపేస్తోంది. ఖతార్ గేట్ స్కాండల్ గా పిలిచే ఈ కేసులో బెల్జియం పోలీసులు పెద్ద ఎత్తున నగదు, కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఫిఫా కోసం ఖతార్ విలాసవంతమైన భవనాలు, కోట్ల డబ్బు, ఇతర సౌకర్యాలను కల్పించిందని యూరోపియన్ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు, గ్రీస్ నాయకురాలు ఎవా కైలీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. బెల్జియన్ ఫెడరల్ పోలీసులు బ్రస్సెల్స్ లోని పార్లమెంట్ కార్యాలయాలు, 19 నివాస వసతి సముదాయాలపై దాడి చేసి 1.50 మిలియన్ యూరోల నగదు సూట్ కేసును పట్టుకున్నారు. ఇంకా కొంత డబ్బును హోటల్ గదిలో దాచినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఎవాకైలీతో పాటు ముగ్గురు ఇటాలియన్లు, ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్, మనీలాండరింగ్, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు. బ్రస్సెల్స్ ఒప్పందంలో భాగంగా వీరంతా ఖతార్ నుంచి డబ్బులు పొందారని బెల్జియం దర్యాప్తు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖతార్ ఖండించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. ఫిఫా కప్ కోసం మైదానాలు నిర్మించిన క్రమంలో వందల సంఖ్యలో వలస కార్మికులు మరణంచారని విమర్శలు ఎదుర్కొంది. దీంతో పాటు ఆ దేశ ప్రవర్తన, స్వలింగ సంబంధాలపై వైఖరి, మైదానాల్లో మద్యం వంటి విషయాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు యూరోపియన్ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలి హోదాలో ఎవా కైలీ మాట్లాడుతూ.. మానవ హక్కుల సంరక్షణలో ఖతార్ అగ్రగామిగా ఉందని ప్రశంసించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆమెను పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు అవినీతి అంశం తెరపైకి రావడంతో ఆమెపై దర్యాప్తు ప్రారంభమవుతుందని పాశ్చాత్య మీడియా విశ్లేషిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)