ఇందు మృతదేహం లభ్యం

Telugu Lo Computer
0

 

హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఇందు (10) కనిపించకుండా పోయిన విషయం విదితమే. ఎన్టీఆర్‌నగర్‌లో స్కూల్‌ నుంచి బాలిక అదృశ్యమైంది. పాప కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం దమ్మాయిగూడ చెరువులో బాలిక  మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న చెరువు దగ్గర ఒక వ్యక్తికి బాలిక కనిపించనట్లు తెలుస్తోంది. ఆ బాలిక పుస్తకాల కోసం వెలుతున్నట్లు తెలిపింది. అదే ప్రదేశంలో మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలకు దారితీస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ చేపట్టి బాలిక మృతికి గల కారణాలను తెలపాలని పోలీసులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)