జగన్ నన్ను అవమానించారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 26 December 2022

జగన్ నన్ను అవమానించారు !


వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా మీడియా సమావేశం నిర్వహించి తాను వైసీపీని ఎందుకు వీడవలసి వచ్చిందో తెలియజేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభిమానుల కోసమే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్లానని స్పష్టం చేశారు. 'మా నాన్న విగ్రహ ఆవిష్కరణకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. వెళ్తే ఎందుకు వెళ్లావని మందలించారు. తండ్రిలేని వాడివి అని పార్టీలో ఉంచుకున్నాం. ఇది నా పార్టీ. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు అన్నారు' అని వంగవీటి రాధా అన్నారు. తనలాగా అవమానాలు మరెవ్వరికీ జరగొద్దని భావించానని, తనకు తండ్రి ఆశయాలే ముఖ్యమని, తన తండ్రిని చంపింది వ్యక్తులు అని, దాన్ని పార్టీలకు ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై రెక్కీ జరిగిందని, చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. తాను తాడూ బొంగరం లేని వాడ్నని, చంపుకోవాలంటే చంపుకోవచ్చని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ కుల కుంపట్లు రాజేస్తోందని, కపట ప్రేమ, అసత్య ప్రచారాలతో కాపులను మోసగించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

No comments:

Post a Comment