ఢిల్లీ మద్యం వ్యాపారం కవితదే ?

Telugu Lo Computer
0

అయ్యో ఇప్పుడెలా : ఢిల్లీ మద్యం కేసులో పూర్తిగా ఇరుక్కుపోయిన కవిత | Oh How  Now Kavitha Who Is Completely Stuck In The Delhi Liquor Case ,Delhi Likker  Scam, Mlc Kavitha, Kcr, Telangana, TRS Government,

ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి అసలైన యజమానికి కల్వకుంట్ల కవితేనని ఈడీ స్పష్టంగా చార్జిషీట్‌లో పేర్కొంది. శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డితో కలిసి కవిత ఈ వ్యాపారం చేశారని,  అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకున్నారని ఈడీ చెబుతోంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మొత్తం కవితే చేశారన్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూ్‌ప.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా స్పష్టం చేశారు.హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశం అయ్యారు. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చెబుతోంది.ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దక్షిణాది నుంచి ఆప్ కి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అదే పనిగా చెబుతోంది. ఈ చార్జిషీటు ప్రకారం చూస్తే.. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ గా చేయడానికి ఇంకా ఎక్కువ కాలం పట్టకపోవచ్చని భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)