కృత్తిమ గుండెను తయారు చేసిన ఐఐటీ కాన్పూర్‌ !

Telugu Lo Computer
0


మానవుని కీలక అవయవాల్లో గుండె ఒకటి. మన గుండె ఎంత చక్కగా పనిచేస్తే, అంత ఆరోగ్యంగా ఉంటాము. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం సమతులమైన ఆహారం తీసుకోవాలి. అలా కాకపోయినా జీవన శైలిలో ఎలాంటి మార్పులు వచ్చినా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. గుండె జబ్బులు వస్తాయి. వాటిలో గుండెపోటు కంటే.. కార్డియాక్‌ అరెస్ట్‌ ప్రమాదకరమైనది. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ప్రాణాపాయం ఎక్కువ. గుండె పోట్లు వచ్చినా కొన్ని సార్లు గుండెకు స్టంట్లు వేసి బతికించవచ్చు. కొన్ని సార్లు స్టంట్లు కూడా పనిచేయవు. సీరియస్‌ సమస్య వచ్చినపుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇక, గుండె జబ్బులతో బాధపడే వారికి ఐఐటీ కాన్పూర్‌ శుభవార్త చెప్పింది. సీరియస్‌ గుండె జబ్బులతో బాధపడే వారికోసం ఏకంగా కృత్తిమ గుండెను తయారు చేసింది. సమస్య తీవ్రతను బట్టి రోగుల్లో ఈ కృత్తిమ గుండెను అమర్చనున్నారు. ఈ గుండె సాధారణ గుండెలాగే పని చేస్తూ సదరు రోగుల ప్రాణాలను నిలపనుంది. ఈ కృత్తిమ గుండె గురించి ఐఐటీ కాన్నూర్‌ డైరెక్టర్‌ అభయ్‌ కరండికర్‌ మాట్లాడుతూ '' ఈ కృత్తిమ గుండెకు సంబంధించిన జంతువులపై ట్రైల్‌ వచ్చే ఏడాది నుంచి మొదలుకానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండె మార్పిడి చాలా సులభం. సీరియస్‌ గుండె సమస్యతో బాధపడేవారికి ఆర్టిఫియల్‌ గుండెల్ని అమర్చవచ్చు. ఐఐటీ కాన్పూర్‌, దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు కార్డియాలజిస్టులు ఈ కృత్తిమ గుండెను తయారు చేశాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి జంతువులపై ట్రైల్స్‌ చేస్తాం. ట్రైల్‌ సక్సెస్‌ అయిన తర్వాత వచ్చే రెండేళ్లలో మనుషులకు వీటిని అమర్చుతాం. ప్రస్తుతం గుండె సమస్యలు చాలా పెరిగిపోయాయి. చాలా మంది పేషంట్స్‌కు గుండె మార్పిడి చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఈ కృత్తిమ గుండెలు రోగులకు ఎంతో ఉపయోగపడతాయి. గుండె మార్పిడి కోసం అవసరమైన సామాగ్రిని 80 శాతం బయటి దేశాలనుంచి తెప్పిస్తున్నారు. కేవలం 20 శాతం సామాగ్రి మాత్రమే ఇండియా నుంచి వాడుతున్నారు. చాలా వరకు స్టంట్లు ఇతర సామాగ్రిని విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. కరోనా కారణంగా వెంటిలేటర్లు తయారు చేసుకున్నాం. ఫారెన్‌ వెంటిలేటర్లు 12 లక్షల దాకా ఉంటే, ఇండియాలో తయారు చేసినవి 3 లక్షలు మాత్రమే. ఇండియాలో 1000 మందికి కేవలం 8 మంది డాక్టర్లే ఉన్నారు'' అని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)