లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎక్కడా తడబడకుండా 403 పాయింట్లు పెరిగి 62,533కి ఎగబాకింది. సెన్సెక్స్ లోని 30 కంపెనీల్లో 24 కంపెనీలు లాభపడడం విశేషం. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.46), బజాజ్ ఫైనాన్స్ (1.75), ఇన్ఫోసిస్ (1.65) లు టాప్ గెయినర్లుగా నిలవగా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, మారుతి, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఇక అత్యధిక మార్కెట్ విలువ కలిగిన 100 కంపెనీల జాబితాలోకి యస్ బ్యాంకు మళ్లీ చేరింది. గత మూడు రోజుల్లో ఈ బ్యాంకు స్టాకు 30 శాతం పుంజుకోగా, ఈ రోజు 13.74 శాతం పెరిగి రూ. 24 వద్ద స్థిరపడింది. ఇక మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.89 వద్ద నిలిచింది. అటు నిఫ్టీ 110.85 పాయింట్ల లాభపడి 18,608 వద్ద స్థిరపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)