వివాదాస్పద ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర విధాన మండలిలో థాకరే మాట్లాడుతూ కర్ణాటకలోని ఒక్క అంగుళం భూమి కూడా తమకు అవసరం లేదని, తమ భూభాగం మాత్రమే తాము కోరుతున్నామని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ, కర్ణాటకలో కలుపుకున్న మహారాష్ట్ర ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా  ప్రకటించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. ఈ తీర్మానాన్ని ఇవాళే సభ ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద ప్రాంతాల్లోని ప్రజలంతా మరాఠీ మాట్లేడేవారని థాకరే చెబుతూ, భాషా ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగేటప్పటికే సరిహద్దుల్లో మరాఠీ భాష వెళ్లూనుకుందన్నారు. ఏళ్ల తరబడి ప్రజలు మరాఠా మాట్లాడుతూ అక్కడ నివసించే వారని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వివాదాస్పద ప్రాంతాలైన బెళగవి, కార్వార్, నిప్పని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌కు తాము మద్దతిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై విమర్శలు ఎక్కుపెడుతూ, సరిహద్దుల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి చాలా దూకుడుగా ఉంటే షిండే మాత్రం మౌనం పాటిస్తున్నారని థాకరే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)