మెస్సీకి అసోంతో ఉన్న సంబంధం పట్ల గర్విస్తున్నాము ?

Telugu Lo Computer
0


ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా - ఫ్రాన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో చివరికి అర్జెంటీనా 4 - 2 తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో ఆ జట్టు తరపున స్టార్ ఆటగాడు మెస్సీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాక, ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మెస్సీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ట్విట్టర్ సంస్థ చరిత్రలో ఈ ట్వీట్లు ఓ రికార్డని ఎలాన్ మస్క్ వెల్లడించారు. అయితే మెస్సీకి అభినందనలు తెలిపే క్రమంలో అసోంకి చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ట్రోలర్స్ కి చిక్కారు. బార్ పేట్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన మెస్సీని అభినందిస్తూ.. 'నువ్వు అసోంతో సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామ'ని ట్వీట్ చేశారు. దాంతో నివ్వెరపోయిన నెటిజన్లు అదెలా? అని ప్రశ్నించగా, అవును మెస్సీ అసోంలో పుట్టాడు అంటూ బదులిచ్చారు. దీంతో అలెర్టయిన నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేయడంతో ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అయితే అప్పటికే కొందరు ఆయా ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేయడంతో వార్తాంశంగా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)