కన్ను కొట్టుకోవడమనేది వ్యాధి లక్షణం !

Telugu Lo Computer
0


సాధారణంగా చాలా మందికి కళ్లు కొట్టుకుంటుంటాయి. అయితే, ఎవరికైన కుడి కన్ను కొట్టుకుంటే..వారికి ఈ రోజు ఏదో మంచి జరుగుతుందని అంటుంటారు. ఎడమ కన్ను కొట్టుకోవడం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇదే విషయం స్త్రీల విషయంలో కళ్ల పరిస్థితి తారుమారుగా ఉంటుంది. స్త్రీలకు ఎడమ కన్ను శుభప్రదంగా పరిగణించబడుతుంది. కుడి కన్ను అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అయితే, సాధారణ కన్ను తక్కువ సమయంలోనే రెప్పవేయడం ఆగిపోతుంది. కానీ, కొన్నిసార్లు ఒక గంటపాటు కన్ను కొట్టుకోవటం కొనసాగుతూనే ఉంటుంది. అలా ఒక రోజు మొత్తం కూడా గడిచిపోతుంది. కొన్ని సార్లు చాలా రోజులు కూడా ఇలా కళ్లు కొట్టుకోవటం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచి లేదా చెడు సంకేతం కాదు. కంటికి జబ్బు వచ్చే సూచనగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆందోళన, కళ్లు అలసిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ వ్యాధి రావచ్చు. ఇందులో కొన్ని గంటలు లేదా రోజుల తరబడి కళ్లు కొట్టుకోవటం కొనసాగుతూనే ఉంది. తర్వాత దానంతట అదే మెరుగవుతుంది. బ్లీఫరోస్పాస్మ్ ని తీవ్రమైన కంటి వ్యాధిగా పరిగణించబడుతుంది. ఇందులో కళ్ల కండరాలు కుచించుకుపోతాయి. కళ్లు రెప్పలాడుతూనే ఉంటాయి. కళ్లు రెప్పలిస్తే నొప్పి వస్తుంది. కొన్నిసార్లు కళ్లు తెరవడం కూడా కష్టంగా మారుతుంది. కళ్లతో పాటు కనుబొమ్మల కండరాలు కూడా మెలికలు తిరుగుతాయి. ఇందులో దృష్టి మసకబారుతుంది. కళ్లపై వాపు మొదలవుతుంది. దీని వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)