వైద్య విద్యార్థులు జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకోవద్దని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పష్టంచేసింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర ధరించాలి లేదంటే చుడీదార్లు మాత్రమే వేసుకోవాలని సూచించింది. డీఎంఈ కార్యాలయంలో వారాంతపు సమీక్ష జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను బోధనాసుపత్రులకు పంపించారు. ప్రధానంగా ఈ డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించారు. ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యార్థులు ఇకనుంచి శుభ్రంగా ఉండే దుస్తులు ధరించడంతోపాటు గడ్డం గీసుకోవాలి. మహిళలు తమ జుట్టు వదిలేయకూడదు. స్టెతస్కోప్‌, యాప్రాన్‌ను తప్పనిసరిగా ధరించాలని డీఎంఈ కార్యాలయం సూచించింది. నిర్దేశించిన డ్రస్‌ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పాటించడంలేదు. ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సిన సందర్భం వస్తే వారి వెంట సహాయకులు లేరని తిరస్కరించరాదని ఆదేశించింది. ఫేస్ రికగ్నైజ్డ్ హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్ లకు ఆదేశాలు జారీ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)