అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.676 ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం

Telugu Lo Computer
0


గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీగా ఎలక్టోరల్‌ బాండ్ల (ఇబి) విక్రయాలు జరిగినట్లు ఎస్‌బిఐ తెలిపింది. నవంబర్‌ 11, 15 తేదీల మధ్య ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయాల 23వ దశలో రాజకీయ పార్టీలు రూ. 676.26 కోట్లు అందుకున్నాయని వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద కమోడర్‌ లోకేష్‌ కె.బాత్రా (రిటైర్డ్‌) ప్రశ్నకు ఎస్‌బిఐ ఈ సమాధానమిచ్చింది. ఈ బాండ్లన్నీ రూ. కోటి విలువ కలిగినవేనని పేర్కొంది. ఈ దశలో మొత్తం (రూ.660 కోట్లకు పైగా) 97.63శాతం ఎస్‌బిఐ న్యూఢిల్లీ ప్రధాన శాఖలో విక్రయాలు జరిగినట్లు తెలిపింది. అక్టోబర్ లో రూ. 545 కోట్ల విక్రయాలు జరగగా, జులైలో రూ.389.50 కోట్ల విక్రయాలు జరిగాయని ఎస్ బి ఐ తెలిపింది. 2018లో ఎలక్టోరల్‌ బాండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇబిల ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన మొత్తం రూ.11,467 కోట్లకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)