నీరవ్ మోదీని భారత్​కు అప్పగించండి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 November 2022

నీరవ్ మోదీని భారత్​కు అప్పగించండి !


బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. తనను భారత్​కు అప్పగించకూడదన్న నీరవ్ అప్పీలును యూకే హైకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణ నిమిత్తం నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ మోదీ ప్రస్తుతం ఆగ్నేయ లండన్​లో ఉన్న వాండ్స్​వర్త్​ జైలులో ఉన్నాడు. భారత్​కు అప్పగింతపై నీరవ్​కు వ్యతిరేకంగా జిల్లా జడ్జి గత ఫిబ్రవరిలోనే తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు నీరవ్ మోదీ. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని కోర్టులో ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో తనను భారత్​కు అప్పగించొద్దని అభ్యర్థించారు. వీటన్నింటినీ పరిశీలించిన లండన్ హైకోర్టు.. కింది కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. నీరవ్​ను భారత్​కు అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల ఎగవేత సహా మోసం, మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కోసం నీరవ్​ను భారత్​కు అప్పగించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెరేమీ స్టువర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే తీర్పుచెప్పారు.

No comments:

Post a Comment