మగ తోడు లేనిదే జమా మసీదులోకి ప్రవేశం లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 November 2022

మగ తోడు లేనిదే జమా మసీదులోకి ప్రవేశం లేదు !


ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్లు వెంట లేకుండా అనుమతించబోమని  ఢిల్లీలోని జమా మసీద్ మాస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు వారి కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని తెలిపింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించారు. ఈ పరిణామంపై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ స్పందించింది. ఈ అంశంపై జమా మసీద్ పాలనా యంత్రాంగానికి నోటీసు జారీ చేయనున్నామని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. ఈ తరహా నిషేధం విధించేందుకు ఎవరికీ హక్కులులేవని తప్పుబట్టారు. జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్‌వో సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బందికలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment