సరిహద్దు వివాదంపై అఖిలపక్ష కమిటీ వేయాలి !

Telugu Lo Computer
0


కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం బసవరాజ్‌ బొమ్మైకు ఆయన ప్రత్యేక లేఖను పంపారు. బెళగావి సరిహద్దు అంశాన్ని సున్నితంగా భావించాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఇవే విషయాలను బెంగళూరులో బుధవారం మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి రాసిన లేఖకు సమాధానంగానే పత్రాన్ని పంపినట్టు వివరించారు. సరిహద్దు విషయంలో సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచాలని అఖిలపక్ష కమిటీ ఏర్పాటు సముచితమని సూచించానన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపు వాదనలు వినిపించేందుకు న్యాయవాదుల బృందాన్ని మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. సరిహద్దు సమస్యపై మహాజన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికే అంతిమమని అందుకు కట్టుబడి ఉన్నామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)