ఫ్యాక్స్ కాన్ కంపెనీలో ఆందోళన

Telugu Lo Computer
0


చైనాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీల్లో తయారీకి అనుమతి ఇచ్చింది. కంపెనీల్లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అనుమానితులను అందులో ఉంచుతున్నారు. కొన్ని నెలలుగా కార్మికులంతా ఫ్యాక్టరీల్లోనే మగ్గుతున్నాయి. సిబ్బంది బయటికి వెళ్లకుండా కొన్ని చోట్ల ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది, కార్మికులు నెలల తరబడి క్వారంట్లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో యాపిల్ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫ్యాక్స్ కాన్ ప్లాంట్లో పని చేసే సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీలో ఘర్షణలు తలెత్తాయి. సెక్యూరిటీ సిబ్బంది కార్మికులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఆ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కొవిడ్‌తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్‌లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)