ఫైనల్లో ఇంగ్లండ్

Telugu Lo Computer
0


అడిలైడ్‌లో ఏకపక్షంగా సాగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బట్లర్, హేల్స్ చెలరేగి ఆడారు. బట్లర్ 49 బంతుల్లో 80, హేల్స్ 47 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరి జోరును అడ్డుకునేందుకు రోహిత్ శర్మ ఆరుగురు బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఫలితం లేకుండా పోయింది. హేల్స్ 7 సిక్సులు, 4 ఫోర్లు సాధించగా, బట్లర్ 3 సిక్సులు, 9 ఫోర్లు కొట్టి సత్తా చాటాడు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టు 169 పరుగులు లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఫైనల్ కు చేరుకున్న బట్లర్ సేన, 13 వ తేదీన పాకిస్తాన్‌తో ఫైనల్లో తలపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)