విమానంలో విందు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 27 November 2022

విమానంలో విందు !


దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పిస్తా హౌస్ రెస్టారెంట్ నిర్వాహకులు హైదరాబాద్‌లో ఓ వెరైటీ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరవాసుల టేస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ రెస్టారెంట్‌ని శామీర్‌పేటలో ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్‌ నెలలో ఈ ప్లేన్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నారు. పాతదైన ఎయిర్‌బస్‌-320ని వేలంలో 75లక్షలకు కొనుగోలు చేసిన పిస్తాహౌస్ యాజమాన్యం 150మంది సిట్టింగ్ కెపాసిటీకి తగినట్లుగా రెస్టారెంట్‌గా మార్చుతోంది. కస్టమర్లు కూర్చొని డిన్నర్, లంచ్ చేసే విధంగా ఈ ఎయిర్‌ బస్‌ని డిజైన్ చేస్తున్నారు. ఫ్లైట్‌ జర్నీ ఫీలింగ్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్‌ని డిజైన్ చేయడంతో పాటుగా రన్‌ వే, సెక్యురిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లోనే టికెట్‌ల కొనుగోలు వంటి వాటిని ఏర్పాటు చేసింది. కేరళలో కొనుగోలు చేసిన ఈ ఎయిర్‌బస్ -320ని కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తెస్తుండగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా  అండర్ పాస్ మార్గంలో తీసుకొస్తుండగా చిక్కుకుపోవడంతో మేదరమెట్ల పోలీసుల సహకారంతో ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా పిస్తా హౌస్‌ తమ వ్యాపార సంస్థల్ని నెలకోల్పి మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 32బ్రాంచీలను ఏర్పాటు చేసింది పిస్తా హౌస్. మొదటి బ్రాంచ్‌ని శాలిబండలో 1997ప్రారంభించారు. అక్కడి నుంచి పిస్తా హౌస్ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, మలేషియా, సింగపూర్‌ లాంటి విదేశాల్లో కూడా శాఖలను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పిస్తా హౌస్‌ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది హలీమ్. పిస్తా తయారు చేసే హలీమ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాగే ఈ రెస్టారెంట్‌ యాజమాన్యం సర్వ్ చేసే ఆహార, తినుబండారాలకు అంతే స్పెషాలిటీ ఉంది.

No comments:

Post a Comment