రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్

Telugu Lo Computer
0


రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్‌ పార్లమెంటు మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌరులే లక్ష్యంగా స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడుతున్నదని, ఇది అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ తీర్మానంపై ఐరోపా పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించింది. ఇందుకు 494 మంది సభ్యులు మద్దతు పలికారు. 58 మంది వ్యతిరేకించగా, మరో 44 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా దేశాలను ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితాలో చేర్చిన అమెరికా, రష్యాను మాత్రం ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించింది. అయితే, యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)