నోయిడా మెట్రో స్టేషన్‌కు టీమ్‌ లీడర్‌గా హిజ్రా

Telugu Lo Computer
0


బీహార్‌లోని కటిహార్‌ జిల్లా సెమాపూర్‌ గ్రామానికి చెందిన మహీ గుప్తా ఓ హిజ్రా అని తెలియడంతో 2007లో ఆమెను ఇంటి నుంచి కన్నవాళ్లే వెళ్లగొట్టారు. అయినా వెనకడుగు వేయకుండా ట్యూషన్లు చెబుతూ వచ్చే డబ్బుతో చదువుకుంది. 2017లో మహీ గుప్తా కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని ఎంతో కష్టపడి చదివింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉద్యోగం సాధించి టీమ్​ లీడర్​ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. ఫోన్‌లు చేసి అభినందనలు తెలుపుతూ తనని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు మహీ గుప్తా గర్వంగా చెబుతున్నారు. ఇతరుల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వారెన్ని మాటలన్నా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ధృడంగా ఉండాలంటూ మహీ గుప్తా చెబుతున్నారు. నోయిడా మెట్రో రైల్​ కార్పొరేషన్ తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు ‘ప్రైడ్​ స్టేషన్​’గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో ఇదో విప్లవాత్మక నిర్ణయం.

Post a Comment

0Comments

Post a Comment (0)