వర్షంతో రెండో వన్డే రద్దు

Telugu Lo Computer
0


భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలగడంతో చివరికి ఆట రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్ అంతకుముందు 29 ఓవర్లకు కుదించబడింది. కానీ కాసేపటికే మళ్లీ వర్షం విజృంభించడంతో ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. భారత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి వన్డేలో కివీస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగే చివరి వన్డే కీలకం కానుంది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ గెలిస్తే సిరీస్‌ ఆ దేశం సొంతమవుతుంది. భారత్ విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ 1-1తో సమమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)