తమిళనాట భారీ వర్షాలు

Telugu Lo Computer
0


తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 10 గంటలకు పైగా ఏకధాటిగా వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మోకాళ్ల లోతులో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నై లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. కరెంట్ షాక్ తో ఇద్దరు చనిపోగా, ఇంటి పై కప్పు కూలి మరొకరు చనిపోయారు. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. ఈనేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే చైన్నైతో పాటు 8 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు, సహాయ కార్యక్రమాలపై సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)